Sri Veera Bramhendra swamy vari charithra - kalagnanam pracharam, Jagtial web portal.

Home   l   contact us

Founder : - Sri Enugurthi Rajanna Aacharya, +91 9849524094 :: Sri Enugurthi Radhakishan Aacharya, +91 9247422573

           
 
                                                              


బ్రహ్మంగారు అవతరిస్తున్నారు

       శ్లో||       గురుపూర్ణిమాయాం సర్వజిన్నామే సోమశ్రవణ మధ్యాహ్నే |
                  కలిదోష నిర్మూలనార్థం | వీరభోగ వసుంధరా: ||

    అర్థం :- సర్వజిత్తు నామ సంవత్సరంలో, గురుపౌర్ణమి (ఆషాఢపూర్ణిమ) రోజున
                సోమవారమూ, శ్రవణా నక్షత్రమూ కలిసివస్తాయి. ఆ రోజునే కలికాలంలోని
                పాపాత్ములను, పాపాలను పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో శ్రీ
                వీరబ్రహ్మేంద్రస్వామివారు "వీరభోగ వసంతరాయులు" గా కలియుగావతారంలో
                 మద్యాహ్నం సమయంలో భూమండలంపై వైకుంఠం నుండి అవతరిస్తారు.
    - ఇది కాలగ్నాన వాక్యం

  * ప్రతి సంవత్సరం పంచాంగంలో శ్రావణపూర్ణిమ రోజున మాత్రమే శ్రవణా నక్షత్రం వస్తుంది.
    ఇతర నెలలలో రాదు.

  * ఆషాఢ మాసంలో పూర్ణిమ రోజున "పూర్వాషాఢ" నక్షత్రం మాత్రమే వచ్చును. ఇది
     జ్యోతిష్య సిద్దాంతం.

     కాని బ్రహ్మంగారు ఆషాఢమాసంలో పౌర్ణమి రోజు సోమవారంతో కలసిన శ్రవణానక్షత్రం
      రోజున అవతరిస్తానని సెలవిచ్చియున్నారు. పంచాంగ గణితం ప్రకారం ఇది చాలా
      విరుద్దం. అసాద్యం. ఇలా జరిగే అవకాశం ఉన్నదా అని , అనేక మంది పండితులు
      తికమక పడ్డారు. కాని బ్రహ్మంగారి మాట నిజమైంది. అదే కలగ్నాన మహత్యం.

      సర్వజిత్తు (2007 లో) , ఆషాఢమాసం ( జులైలో) పౌర్ణమి (౩౦ వ తేదిన) సోమవారం
      రోజున శ్రవణా నక్షత్రం కలిసివచ్చింది. ది. 30-07-2007 సోమవారం ఆషాఢ పౌర్ణమి,
      శ్రవణా నక్షత్రం ఈ రోజే గురుపౌర్ణమి.

  వివరణ సేకరణ : చింతాడ విశ్వనాథ శాస్త్రి, విద్యాధరపురం, విజయవాడ-12 వారు ప్రచురించిన కరపత్రాల నుండి.

Designed by G.Jagadeeshwar Reddy, Cyber-tech computers, jagtial, 9391511076